Anakapalli: అనుమానం ఎంత పని చేసింది... స్క్రూ డ్రైవర్‌తో భార్యను
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:28 PM
అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త.
అనకాపల్లి, డిసెంబర్ 24: అనుమానం పెనుభూతం అంటారు. భార్యా/భర్త మనసులో ఒక్కసారి అనుమానం అనే బీజం పడితే.. అప్పటి వరకు సజావుగా సాగిన కాపురాలు కుప్పకూలిపోతాయి. అనుమానంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న గొడవ అయితే పర్వాలేదు.. కానీ అది చిలికి చిలికి గాలి వానగా మారితే మాత్రం పెను ఉపద్రవాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అనుమానం అనే రోగంతో కట్టుకున్న భార్యను నానా హింసలకు గురిచేస్తున్న వారు ఎందరో. అలాగే అనుమానంతో భార్యలు చేతిలో నలిగిపోతున్న భర్తలు కూడా ఉన్నారు. మరికొందరు అయితే విచక్షణమరిచి తమ అర్ధాంగిని కడతేర్చిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకపాల్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కడదాగా తోడుండాల్సిన భర్తే.. భార్యను అతి కిరాతంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని ఎలమంచిలి పట్టణంలో అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన దంపతులు బతుకుతెరువు కోసం ఎలమంచికి వచ్చారు. ఆ దంపతులు పాత ఇనుము దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండాన్ని గమనించిన భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఫోన్‌లో మాట్లాడాటాన్ని భార్య కొనసాగించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. ఆమెను అతి కిరాతకంగా స్క్రూ డ్రైవర్‌తో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానకంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇవి కూడా చదవండి...
అండగా ఉంటా.. వృద్ధురాలు నాగేశ్వరమ్మకు పవన్ హామీ
రుషికొండపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ.. ఏం తేల్చారంటే
Read Latest AP News And Telugu News