Jaggayyapeta murder: జగ్గయ్యపేటలో సస్పెక్ట్ షీటర్ దారుణ హత్య
ABN , Publish Date - Dec 05 , 2025 | 09:29 AM
జగ్గయ్యపేటలో ఓ సస్పెక్ట్ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పార్టీ వేడుకలో ఇరువురి మధ్య చెలరేగిన వాగ్వాదమే హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 05: జగ్గయ్యపేటలో దారుణ హత్య చోటుచేసుకుంది. చిల్లుకల్లులో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో వివాదం చెలరేగడంతో ఓ సస్పెక్ట్ షీటర్ హత్యకు గురయ్యాడు. అనంతరం ఈ వీడియోలను నిందితుడు.. తనకు తానే వాంటెడ్ క్రిమినల్‌నని రాసుకుని ఇన్‌స్టా వేదికగా పోస్టింగులు పెడుతున్నాడు.
ఆస్పత్రికి తరలించి...
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పేరు నమోదైన పిల్ల సాయి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి.. చిల్లకల్లు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి భవానీపురం పీఎస్‌లో సస్పెక్ట్ షీటర్‌గా నమోదైన అలవల నవీన్ రెడ్డి సహా గంజాయి, రౌడీ షీటర్ల బ్యా్చ్‌కు చెందిన పలువురు హాజరయ్యారు. పార్టీ మధ్యలో నవీన్ రెడ్డి, పిల్ల సాయిల మధ్య వివాదం చెలరేగి.. ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన పిల్ల సాయి.. నవీన్ రెడ్డిని ఇష్టానుసారంగా పొడిచాడు. తీవ్ర రక్తపు మడుగులతో పడిఉన్న నవీన్ రెడ్డిని పిల్లసాయి అనుచరులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి గేటు బయట వదిలేసి పరారయ్యారు. అనంతరం క్షతగాత్రుడు మృతిచెందాడు.
నవీన్ రెడ్డిని పొడిచిన వీడియోలను పిల్లసాయి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. తనకు తానే వాంటెడ్ క్రిమినల్‌నని రాసుకుని పలువురికి షేర్ చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇవీ చదవండి: