Putin Car Speciality: కారు కాదది.. రోడ్డుపై కదిలే పడవ..!
ABN , Publish Date - Dec 05 , 2025 | 08:05 AM
పుతిన్ ఏ దేశానికి వెళ్లినా.. ఆయన బుల్లెట్ ప్రూఫ్ 'ఆరన్ సెనాట్ లైమోజిన్ కారును విమానంలో అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయన ఆ కారులోనే పర్యటిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: పుతిన్ ఏ దేశానికి వెళ్లినా.. ఆయన బుల్లెట్ ప్రూఫ్ 'ఆరన్ సెనాట్ లైమోజిన్ కారును విమానంలో అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయన ఆ కారులోనే పర్యటిస్తారు. పుతిన్ కారుపై గ్రెనేడ్లు పడ్డా చెక్కు చెదరదు. అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూప్. ఇందన ట్యాంకుకు కూడా ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. టైర్లు పంక్చర్ కావు. నాలుగు టైర్లూ పంక్చరైనా కారు ఆగకుండా దూసుకుపోతుంది.
క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ, ఎలాంటి నేలపై అయినా దూసుకుపోయేలా 4 వీల్ డ్రైవ్, హైడ్రాలిక్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది. అత్యంత శక్తివంతమైన వీరి ట్విన్ టర్బో ఇంజన్ తో కూడిన ఈ వాహనం.. అంత బరువుతోనూ కేవలం 6 సెకనల్లో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కారు లోపల అత్యంత అదునాతన, భద్రతాపరమైన ఫీచర్లతో సీట్లు, లైటింగ్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
PM Modi Gifts Bhagavad Gita To Putin: పుతిన్‌కు భగవద్గీత బహూకరించిన ప్రధాని మోదీ
IndiGo Crisis: ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు!