Eluru Attack: యువతిపై రౌడీ షీటర్ అత్యాచారం.!
ABN , Publish Date - Dec 05 , 2025 | 10:59 AM
ఏలూరులో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన జరిగింది. ఓ యవతిని హింసించి, అత్యాచారం చేశాడో దుండగుడు. ఈ ఘటనపై బాధితులు వెంటనే ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు.. ఇప్పుడు ఉన్నతాధికారులకు తెలియడంతో కేసు నమోదు చేసినట్టు సమాచారం.
ఏలూరు జిల్లా, డిసెంబర్ 05: నగరంలో అర్ధరాత్రివేళ అమానుషం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు రౌడీ షీటర్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హడావుడిగా కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అసలు వివరాలివీ..
ఈడ్చుకెళ్లి..
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరులో తన స్నేహితురాలి వద్ద ఉంటోంది. ఈ నెల 2న అర్ధరాత్రి వేళ.. ఇద్దరు రౌడీ షీటర్లు మద్యం సేవించి వారి ఇంటికి వెళ్లారు. తలుపులు, కిటీకీలు బాదుతూ ఇబ్బందులకు గురిచేశారు. ఇంతలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి తలుపులు తీయగా.. ఆమెను కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయ భవనంలోకి ఈడ్చుకెళ్లాడో రౌడీషీటర్. అనంతరం లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడ్నుంచి వెళ్లిపోయారా రౌడీ షీటర్లు. ఆ తర్వాత మళ్లీ కాసేపటికే వచ్చి ఇద్దరు యువతులనూ ఇష్టానుసారంగా బెల్టుతో కొట్టి బెదిరించారు.
ఈ ఘటనపై బాధిత యువతులిద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్కడి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఇంతలో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాధిత యువతిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: