Home » Crime News
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు.
ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ పొరుగింటి 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో ఓ వ్యక్తి, అతడి నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరివీ హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నాలుగు అంతస్తుల హోటల్ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్ సుమంత్ జైన్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.