Share News

Hyderabad: ఈ సుమిత్ర లేడీకాదు.. కిలాడీ.. ఏం చేసిందంటే..

ABN , Publish Date - Jan 07 , 2026 | 08:47 AM

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై స్ర్పే చల్లి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకొని ఉడాయించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి,

Hyderabad: ఈ సుమిత్ర లేడీకాదు.. కిలాడీ.. ఏం చేసిందంటే..

- వృద్ధురాలిపై స్ర్పేతో దాడి.. 10 తులాల బంగారం చోరీ

హైదరాబాద్: సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Sarurnagar Police Station) పరిధి కర్మన్‌ఘాట్‌లో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ (68)పై స్ర్పేతో దాడి చేసి సుమారు 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలికి పరిచయస్తురాలైన సుమిత్ర(Sumitra) అనే మహిళ మరో ఇద్దరితో కలిసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంటికి వెళ్లింది. ముఖంపై స్ర్పేతో దాడి చేసి అపస్మారక స్థితిలోకి చేరిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న పది తులాల బంగారంతో ఉడాయించారు.


city5.2.jpg

వృద్ధురాలు ఫిర్యాదు మేరకు సుమిత్రను అదుపులోకి తీసుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు(Sarurnagar Police) మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్‌ ఏసీపీ కిష్టయ్య, సరూర్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి పరిశీలించారు.


city5.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 07 , 2026 | 08:47 AM