Share News

Indian community USA: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

ABN , Publish Date - Jan 05 , 2026 | 09:54 AM

అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్‌లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికితా గోడిశాల అనే యువతి గత వారం నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె మృతదేహం ఒకప్పటి స్నేహితుడు అర్జున్ అపార్ట్‌మెంట్‌లో లభ్యమైంది.

Indian community USA: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Telugu woman killed In USA

అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్‌లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికితా గోడిశాల అనే యువతి గత వారం నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె మృతదేహం ఒకప్పటి స్నేహితుడు అర్జున్ అపార్ట్‌మెంట్‌లో లభ్యమైంది. అయితే అప్పటికే ఆ యువకుడు అమెరికా వదిలి భారతదేశానికి వచ్చేశాడు. అమెరికాను వదిలే ముందు నికిత కనిపించడం లేదని అతడే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం (Telugu woman killed USA).


కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి నికిత కనిపించడంలేదని పోలీసులకు అర్జున్ ఫిర్యాదుచేశాడు. జనవరి 2 వ తేదీన అతడు అమెరికా నుంచి భారత్‌కు వచ్చేశాడు. అర్జున్ పరారీ గురించి తెలుసుకున్న పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేసి అతడి అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయగా నికిత మృతదేహం లభ్యమైంది. నికిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నికితను అర్జున్ చంపేసినట్టు తేలింది. అయితే ఆ హత్యకు గల కారణాలు బయటకు రాలేదు (shocking crime in America).


నికిత కనిపించకపోవడంతో ఆమె ఫొటోను స్నేహితురాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆచూకీ కోసం విపరీతంగా ప్రయత్నించారు (viral US crime news). ఆమె హత్యకు గురైందని ఆదివారం వెల్లడి కావడంతో షాక్‌కు గురయ్యారు. నికిత కుటుంబం మూలాలు సికింద్రాబాద్‌కు చెందినవని పోలీసులు గుర్తించారు. అర్జున్‌ను పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


ఇవి కూడా చదవండి..

వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..


మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 05 , 2026 | 09:54 AM