Secundrabad: నీకెంత ధైర్యం? నా సోదరుడినే డబ్బులు అడుగుతావా?
ABN , Publish Date - Jan 03 , 2026 | 08:53 AM
నీకెంత ధైర్యం? నా సోదరుడినే డబ్బులు అడుగుతావా..? అంటూ.. ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఓల్డ్ బోయినపల్లిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నారు.
- బెట్టింగ్ డబ్బుల చెల్లింపులో కత్తితో దాడి, వ్యక్తికి తీవ్ర గాయాలు
సికింద్రాబాద్: ‘‘నా సోదరుడినే డబ్బులు అడుగుతావా?’’ అంటూ ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సంఘటన ఓల్డ్ బోయినపల్లి(Old Boyinapally)లో చోటుచేసుకుంది.
ఎస్‌ఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం .. ఆర్. సాయి కిరణ్ అలియాస్ బియ్యం సాయి, ఉదయ్ కిరణ్, విక్రం స్వామి, షేక్ వలి, మరో వ్యక్తితో కలిసి ఓల్డ్ బోయినపల్లి చెక్ పోస్టు సమీపాన ఉన్న ఒక వైన్స్ పర్మిట్ రూమ్‌కు వెళ్లారు.

షేక్ షకీల్, ఉదయ్ కిరణ్‌లు మొబైల్‌లో లూడో గేమ్ ఆడారు. ఎవరు గెలిస్తే వారికి రూ.500 చెల్లించేటట్లుగా బెట్టింగ్ వేశారు. షేక్ షకీల్ విజేత నిలవగా రూ. 500 చెల్లించమని కిరణ్‌ను అడిగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ సోదరుడు ఆర్. సాయి తన సోదరుడిని డబ్బులు అడగేందుకు ‘నీకెంత దైర్యం’ అంటూ షకీల్ పై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని వలి.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News