Share News

Hyderabad: చెత్తకుప్ప వద్ద నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యం

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:02 AM

చెత్తకుప్ప వద్ద.. నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. నగరంలోని కాటేదాన్‌ డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌ బస్తీలో ఆడ శిశువు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: చెత్తకుప్ప వద్ద నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యం

రాజేంద్రనగర్‌(హైదరాబాద్): నెలలు నిండని ఆడ శిశువు మృతదేహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్‌ కవర్‌తో చుట్టి రోడ్డు పక్కన చెత్తకుప్ప దగ్గర పడేశారు. ఈ ఘటన కాటేదాన్‌ డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌ బస్తీలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. మైలార్‌ దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణగౌడ్‌(Mylardevupally Inspector Satyanarayana Goud) తెలిపిన ప్రకారం బాబుల్‌రెడ్డినగర్‌ రోడ్డు పక్కన సోమవారం ఉదయం పారిశుధ్య పనులు చేస్తున్న సిబ్బందికి ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో ఆడ శిశువు మృతదేహం కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్‌దేవుపల్లి పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


city7.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..

బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేశారా..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 06 , 2026 | 10:02 AM