Share News

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

ABN , Publish Date - Jan 03 , 2026 | 01:43 PM

అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్‌ రఫిక్‌, రఘురామ్‌ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

- డ్రైవర్ల దుర్మరణం

మడకశిర(అనంతపురం): అతివేగం ఇద్దరిని బలిగొంది. మండలంలోని అగ్రంపల్లి సమీపాన గురువారం అర్ధరాత్రి ఎన్‌హెచ్‌ 544 ఈ జాతీయ రహదారిపై వ్యాన్‌ను బొలెరో అతివేగంతో ఢీకొట్టడంతో డ్రెవర్లు మహమ్మద్‌ రఫిక్‌ (32), రఘురామ్‌(19) దుర్మరణం చెందారు. రెండువాహనాలు నుజ్జయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యం ప్రాంతానికి చెందిన రఘురామ్‌ బొలెరో వాహనంలో గుడిబండ సంత నుంచి హిందూపురానికి(Hindupuram) పశువులను తీసుకెళ్లాడు.


అక్కడ దించేసి తిరుగు ప్రయాణమయ్యాడు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మహమ్మద్‌ రఫిక్‌ వ్యాన్‌లో పెనుకొండ సమీపంలోని కియ పరిశ్రమకు సంబంధించిన సామగ్రిని పుణెకి తీసుకెళ్లాడు. అక్కడ దించేసి కియకి తిరుగి వస్తున్నాడు. అగ్రంపల్లి వద్ద జాతీయ రహదారిపై వ్యాన్‌ను బొలెరో వాహనం అతివేగంతో ఎదురుగా వెళ్లి ఢీకొంది.


pandu5.2.jpg

ఇరు వాహనాల డ్రెవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. బొలెరో వాహనంలోని భువనేశ్వర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రఘురామ్‌ తండ్రి శివానంద్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రఘురామ్‌కు వివాహం కాలేదు. మహమ్మద్‌ రఫిక్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు

ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల

Read Latest Telangana News and National News

Updated Date - Jan 03 , 2026 | 01:43 PM