Home » Crime News
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 161పై ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు.
రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది.
వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో మరో నిందితుడు సాదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని సమృద్ధి మహామార్గ్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొని ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
కదిలే రైలు తలుపు వద్ద వేలాడుతోన్న ఒక అనుమానిత దొంగను ప్రయాణికుడు కాళ్లతో తన్నుతూ కిందకు తోసేసిన ఘోర ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
దోపిడీతో పాటు మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఓ ముఠా బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామ ప్రజలను భయపెడుతోంది. వరుసగా చోరీలు చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ఆ దొంగల ముఠా సభ్యులు.. మహిళల జుట్టు కత్తిరిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు చేయడం కలకలం రేపింది. ఆధ్యాత్మిక కేంద్రం ముసుగులో మత్తు పదార్థాల దందా చేస్తున్న ఆ స్వామీజీ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారానికి గురైన ఆ చిన్నారికి సరైన వైద్యం అందక మృతి చెందడంతో సదరు వైద్యులపై సుప్రీంకోర్టు మండిపడింది.