Share News

Uttar Pradesh: దారుణం.. లవర్‌తో కలిసి భర్తను చంపి ముక్కలు చేసి.. పాలిథిన్ కవర్లలో..

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:22 AM

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. తమ భాగస్వామిని దారుణంగా హతమార్చుతున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ఘోరంగా చంపింది భార్య.

Uttar Pradesh: దారుణం.. లవర్‌తో కలిసి భర్తను చంపి ముక్కలు చేసి.. పాలిథిన్ కవర్లలో..
Shocking Crime Uttar Pradesh

ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) అలీగఢ్‌ (Aligarh)లోని లోథా ప్రాంతంలో జరిగిన ఎలక్ట్రీషియన్ హత్య కేసులో పోలీసులు (Police) సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో మృతుడి భార్య‌తో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ (Arrest)చేశారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే ( love affair) హత్యకు కారణం తేలింది. ప్రియుడు అతని స్నేహితులతో కలిసి భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి, పాలిథిన్ సంచుల్లో (polythene bags) ప్యాక్ చేసి పలు ప్రాంతాల్లో పారవేసినట్లు పోలీసులు దర్యాప్తు (Police investigating)లో తేలింది.


ఛందౌసియాలోని పాత్రోవా రోడ్డులో ఈద్గా వెలుపల పాలిథిన్ సంచిలో చుట్టబడ్డ యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి తల, చేతులు, కాళ్లు నరికివేయబడ్డాయి. పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మొహల్లా చున్నీ నివాసి రాహూల్‌గా గుర్తించారు. ఇటీవల రాహుల్ కనిపించడం లేదని అతని భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూబీని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా సంచలన విషయాలు బయటపెట్టింది. తన ప్రియుడు గౌరవ్ అతని స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. రూబీ, గౌరవ్ తో పాటు వాళ్లకు సహాయపడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.



ఇవి కూడా చదవండి..

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

For More Prathyekam And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 11:52 AM