Meerpet Madhavi Case: మీర్‌పేట్ మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మరదలితో అక్రమ సంబంధం..
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:26 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కొత్తగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం అని తెలుస్తుంది.
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో మాధవి హత్య కేసు సంచలనం సృష్టించింది. మాధవిని హత్య చేసిన ఆమె భర్త, మాజీ సైనికుడు గురుమూర్తి మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటిని ఉడికించి, కాల్చి పొడి చేసి చెరువులో కలిపేశాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా పక్కా ప్లాన్‌తో తన పని పూర్తి చేశాడు. ఈ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా మాధవి హత్య కేసులో ఒక కీలకమైన మలుపు వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో జరుగుతున్న ఫాస్ట్ ట్రాక్ విచారణలో భాగంగా ఈ అప్డేట్ వెలువడింది. ఈ కేసులో పోలీసులు మొత్తం 36 మంది సాక్షులను చేర్చగా, అందులో 20 మందికి పైగా సాక్షులను విచారించినట్లు తెలిపారు.
మాధవి హత్యకు ప్రధాన కారణం గురుమూర్తి అక్రమ సంబంధం. కొంత కాలంగా తన మరదలు (భార్య సోదరి) తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే మాధవి, గురుమూర్తికి తరుచూ గొడవలు జరిగేవి. తన అక్రమ సంబంధానికి మాధవి అడ్డు వస్తుందని భావించిన గురుమూర్తి ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. జనవరి 16, 2025న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే గురుమూర్తి హత్యకు ఒడిగట్టాడు. డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని పథకం వేశాడు.
ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. అక్టోబర్ నుంచి రోజువారీ విచారణ జరుగుతుంది. ఈ కేసులో మృతదేహం లభ్యం కాకపోయినా, పోలీసులు సేకరించిన సైంటిఫిక్ ఆధారాలు డీఎన్ఏ తో పాటు క్లూస్ టీమ్ రిపోర్ట్ నిందితుడిని శిక్షించడానికి కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తు సమయంలో అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి హత్య చేసినట్లు తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
రామ్ సుతార్ మృతి శిల్ప కళకు తీరని లోటు: కేసీఆర్