Share News

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

ABN , Publish Date - Dec 20 , 2025 | 09:55 AM

ఓ వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ సభ్యులకు అందులోని ఓ ఫ్లాట్‌లో నివసించే మహిళకు మధ్య నెలకొన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

- పోలీస్‌ కేసుతో మనోవేదన.. గుండెపోటుతో వ్యక్తి మృతి

సికింద్రాబాద్: అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ సభ్యులకు అందులోని ఓ ఫ్లాట్‌లో నివసించే మహిళకు మధ్య నెలకొన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్‌ పద్మావతికాలనీలో అర్జున శ్రీనివాసం అపార్టుమెంటులో 66 కుటుంబాలు ఉంటా యి. అపార్టుమెంటులోని ఓ ఫ్లాట్‌లో విష్ణుప్రియ అనే మహిళ తన తల్లితో కలిసి అద్దెకు ఉంటోంది. ఢిల్లీలో ఉన్న ఫ్లాట్‌ యజమాని ఆ ఫ్లాట్‌ నిర్వహణ బాధ్యతలు తన బావమరిది శివకు అప్పగించాడు.


విష్ణుప్రియ(Vishnupriya) సకాలంలో అద్దె ఇవ్వడం లేదంటూ శివ ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించాడు. సివిల్‌ తగాదాలో తలదూర్చలేమని పోలీసులు చెప్పారు. విష్ణుప్రియను ఖాళీ చేయించమని శివ అపార్టుమెంటు అసోసియేషన్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ సభ్యులకు, విష్ణుప్రియకు మధ్య వాగ్వాదం జరిగింది. రాకే్‌షరెడ్డి పార్కింగ్‌ వద్ద ఉన్న సమయంలో అతనికి విష్ణుప్రియకు వాగ్వాదం జరిగింది. విష్ణుప్రియ ఉప్పల్‌ పీఎస్‏లో ఫిర్యాదు చేసింది.


city5.jfif

ఎస్సై చిరంజీవి రాకే్‌షరెడ్డిపై కేసు నమోదు చేసి పలుమార్లు పీఎస్‏కు పిలిచాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాకేశ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడని అపార్టుమెంటు వాసులు ఆందోళనకు దిగారు. ఉప్పల్‌ పోలీసులు జోక్యం చేసుకుని అపార్టుమెంటులో ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. విషయం తెలుసుకున్న విష్ణుప్రియ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. విష్ణుప్రియ తరపున మధ్యవర్తిగా వచ్చిన అడ్వకేట్‌ ఈ నెలాఖరుకు ఇల్లు ఖాళీ చేస్తుందని హామీ ఇచ్చినట్లు అపార్టుమెంటు వాసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 09:55 AM