Hyderabad Cyber Crime: డాక్టర్ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:53 PM
సైబర్ మోసగాళ్లు జనాల బలహీనతలు, భయాలను క్యాష్ గా చేసుకుని కోట్ల రూపాయాలు కాజేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఏదో ఒక మార్గంలో మనపై సైబర్ కేటుగాళ్లు దాడి చేశారు. తాజాగా ఓ వైద్యుడికి మహిళను ఎరగా వేసి.. రూ.14 కోట్లు కాజేశారు.
హైదరాబాద్, ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో సైబర్ కేటుగాళ్ల చోరీలు ఎక్కువయ్యాయి. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేసి.. కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. నిరక్ష్యరాసుల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు వంటి చదువుకున్న అనేక మంది విద్యావంతులు కూడా వీరి ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడి పోతున్నారు. అమ్మాయిలను ఎరగా వేసి... కోట్లాది రూపాయలను చోరీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad cyber crime) కు చెందిన డాక్టర్ నుంచి రూ.14 కోట్లు సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సదరు వైద్యుడిని బురిడీ కొట్టించారు. తొలుత ఫేస్ బుక్ ద్వారా అందమైన అమ్మాయి ఫొటోలతో డాక్టర్‌కు మెసేజ్ చేశారు. ఫేస్ బుక్ ద్వారా సదరు లేడీ.. తాను ఒక ఒంటరి మహిళలని కంపెనీలో పని చేస్తానని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు స్టాక్ మార్కెట్లో ద్వారా తమ కంపెనీలో పెట్టుబుడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది.
ఆ మహిళ మాటలు నమ్మిన వైద్యుడు.. తన ఇల్లును అమ్మి రూ.14 కోట్లు స్టాక్ మార్కెట్లో పెట్టాడు. ఆ తర్వాత మహిళ నుంచి స్పందన రాకపోవడంతో తాను మోసపోయినట్లు వైద్యుడు(doctor cheated 14 crore) తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు డాక్టర్ ను కాంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు. కాంబోడియాలో తిష్ట వేసిన చైనీయులే ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని, ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. కాంబోడియాలో ఉన్న సైబర్ నేరగాలకు mule అకౌంట్స్ అందించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. mule అకౌంట్ లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read:
త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరి: డిప్యూటీ సీఎం భట్టి..
రేవంత్ రెడ్డి సర్కార్‌కి హనీమూన్ ముగిసింది: కేటీఆర్