Maoists: త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:09 PM
త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వ పునరావాస పథకాలు, భద్రతా బలగాల ఒత్తిడి..
హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతూ.. త్వరలో పూర్తిగా అంతమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు 509 మంది మావోయిస్టు కేడర్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 2 సెంట్రల్ కమిటీ సభ్యులు, 11 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు.
తాజాగా డిసెంబర్ 19న 41 మంది మావోయిస్టులు (వీరిలో ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్ నుంచి) డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టుల్లో తెలంగాణకు చెందినవారు 54 మంది మాత్రమే ఉన్నారు.
పోలీసు రికార్డుల ప్రకారం కేవలం 21 మంది మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. వీరిలో ఐదుగురు సెంట్రల్ కమిటీ, 8 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు. వీరంతా లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుంది.
మధ్యప్రదేశ్ ఇప్పటికే (డిసెంబర్ 11న సీఎం మోహన్ యాదవ్ ప్రకటన) మావోయిస్టు రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆపరేషన్ కగార్ లక్ష్యం కంటే ముందే ఈ ఫలితం దక్కింది. ఇక, తెలంగాణలో మిగిలిన కేడర్లు లొంగిపోయేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్