Hyderabad: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బిగ్ షాక్..
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:33 PM
నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులందరినీ అటాచ్ చేశారు. కొందరు అధికారులు టాస్క్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్ కొన్నేళ్లుగా పాతుకుపోయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, డిసెంబర్ 20: నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులందరినీ అటాచ్ చేశారు. కొందరు అధికారులు టాస్క్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్ కొన్నేళ్లుగా పాతుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో టాస్క్‌ఫోర్స్ అధికారులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక నిందితుడిని తప్పించినందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ విభాగంపై సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టారట. టాస్క్‌ఫోర్స్ విభాగం ప్రక్షాళనకే సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Also Read:
త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరి: డిప్యూటీ సీఎం భట్టి..
రేవంత్ రెడ్డి సర్కార్‌కి హనీమూన్ ముగిసింది: కేటీఆర్