Home » Court
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు.
పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు.. బండి భగీరథ్‌కు మేడ్చల్–మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ను 2026 సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ప్రక్రియలో తాము మధ్యంతర జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
గండిపేట భూకబ్జా కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్‌గూడా జైలుకు తరలించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.
న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా 20 ఏళ్ల తర్వాత విచారణ చేస్తామని కోర్టు ఉత్తర్వులు ఇస్తే? అది కూడా 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలి విషయంలో! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బాంబే హైకోర్టులో సరిగ్గా ఇదే జరిగింది.
ఢిల్లీ హైకోర్టు ఆన్‌లైన్ విచారణ సందర్భంలో ఒక వికృత ఘటన చోటుచేసుకుంది. విచారణలో పాల్గొన్న వారిలో ఒకరు స్క్రీన్‌పై పదేపదే అశ్లీల కంటెంట్, అభ్యంతరకరమైన ఆడియో ప్లే చేయడంతో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.