Home » Congress
నా పోరాటం ఏ వ్యక్తిపైనా కాదు, నా పోరాటం మహిళల కోసమే అని కేరళ సినీ నటి రిని ఆన్ జార్జ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది సేపటికి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని సహా దేశంలో ఏ రాజకీయ నేత అయినా 30 రోజులు జైల్లో ఉంటే వారు పదవి నుంచి దిగిపోయేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి వ్యతిరేకత వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు అందరికీ వర్తిస్తుందని.. కానీ, కాంగ్రెస్ మాత్రమే ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదంటూ చురకలంటించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్ విడుదల చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.
ఇటీవల జరిగిన కాన్‌స్టిట్యూషన్ క్లబ్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్)గా రూడీ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ నేత సంజీవ్ బల్యాన్‌పై ఆయన భారీ ఆధిక్యతతో గెలిచారు. మొత్తం 1,295 ఓట్లలో 707 ఓట్లు రూడీ గెలుచుకున్నారు.
బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని నిలబెట్టాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
తమ ప్రభుత్వం బీసీలకు కల్పించాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్లకు గతంలో కేసీఆర్ చేసిన చట్టమే శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..
బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ఎస్‌ఐఆర్ అనేది ఓట్లను దొంగిలించేందుకు వాడుతున్న ఆయుధమని కాంగ్రెస్ అగ్రనేత ..