Home » Chittoor
ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ ఎస్‌ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.
కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీని కొంతమంది ఉద్యోగులు అభాసుపాల్జేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
క్యాలెండర్‌లో కాయితాలు చిరిగిపోతున్నాయి తప్ప, ప్రజల కడగండ్లు తీరుతున్నాయా? అధికారం చేతులు మారింది తప్ప, జీవనప్రమాణాలు పెరిగాయా? సొంత పాలనలోకి మారి ఏడు దశాబ్దాలు దాటి ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నా పల్లెలు ఈసురోమంటూనే ఉన్నాయి. సేద్యం ఒక జూదంగా మారిపోయింది.
చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలు వచ్చి గుర్రంకొండ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనులు చేశాయి. ఈ ఆత్మలు కూడా వారం రోజుల పాటు ఉపాధి పథకంలో వంక పనులు, చెరువులో పూడికతీత పనులు, పండ్ల తోటల పనులు చేయడం విశేషం. గ్రామాల్లో పాడి రైతుల కోసం నిర్మించిన గోకులాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీ బృందం బహిరంగ సభలో వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో మదనపల్లె చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడి భూములు విలువైనవే కాదు.. ఇక్కడ భూకబ్జాలు, ఆక్రమణలు, ఫోర్జరీ రికార్డులతో స్వాధీనం చేసుకునే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు ఎక్కువగా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ సిబ్బంది, అధికారులే వీరికి ప్రత్యక్ష, పరోక్షకారులు. ఈ క్రమంలో అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వీరంతా కలసి పనిచేసినవారే.
తిరుపతి నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
ఎడమచేతి వాటం కలిగిన వారిని ఒకప్పుడు పుర్రచెయ్యోడు లొడ్డోడు.. అని ఎగతాళి చేసేవారు. ఎడమచేతిని వాడటం ఏ రకంగానూ లోపం కాదు అయినా ఇప్పటికీ కుటుంబాల్లో కూడా ఎంతో కొంత గాయపడే మాటలు విసురుతూనే ఉంటారు. బలవంతంగా కుడి చేతిని వాడాలని వేధిస్తుంటారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ డేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీపీజేఏ) నిర్వహంచిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో తిరుపతి ఆంధ్రజ్యోతి స్టాప్ ఫొటోగ్రాఫర్లు ఆర్ లావణ్య కుమార్, కె.సాయికుమార్‌లకు బహుమతులు లభించాయి.
సుదుటిపై మూడు నామాలతో జన్మించిన ఆవుదూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు (యల్లంపల్లె) చెందిన రవినాయుడు సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు.