Share News

Tirupati Elephant Attack: అర్ధరాత్రి గజరాజుల బీభత్సం..

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:29 AM

పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం నుంచి యల్లంపల్లికి గజరాజులు చేరినట్లు రైతులు అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు.

Tirupati Elephant Attack: అర్ధరాత్రి గజరాజుల బీభత్సం..
Tirupati Elephant Attack

తిరుపతి, అక్టోబర్ 11: జిల్లాలోని చంద్రగిరి మండలం యల్లంపల్లిలో గజరాజులు (Tirupati Elephant Attack) బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామంలోకి వచ్చిన ఏనుగుల గుంపు.. పంట పొలాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. 7 పెద్ద ఏనుగులు, 2 చిన్న ఏనుగుల గుంపు గ్రామ పరిసరాల్లోకి చొరబడింది. అర్ధరాత్రి ఏనుగుల భీకర శబ్దాలతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైతులు పండించిన వరి పంట, గడ్డివాము,ఫెన్సింగ్ కూసాలు, నీటి పైపులను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేసాయి. పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం నుంచి యల్లంపల్లికి గజరాజులు చేరినట్లు రైతులు అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు.


హుటాహుటిన గ్రామానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. ఏనుగులను అడవివైపు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులు కూడా అటవీ శాఖ అధికారులకు సహాయంగా నిలిచారు. ఏనుగుల గుంపు బీభత్సంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పంటలను మొత్తం ఏనుగులు నాశనం చేయడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పడెప్పుడు ఏనుగులు గ్రామాన్ని వీడి అడవిలోకి వెళ్లిపోతాయా అని ప్రజలంతా ఎదురుచూస్తున్న పరిస్థితి. వాటిని అడవిలోకి తరలించేందుకు అటవీ అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

మచిలీపట్నం పీఎస్‌ ఘటనపై ఎస్పీ సీరియస్.. పేర్నినానిపై కేసు నమోదు

నిండు ప్రాణం తీసిన వేడి టీ.. టీ తాగిన రెండు రోజులకు..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 10:42 AM