Share News

Perni Nani Case: మచిలీపట్నం పీఎస్‌ ఘటనపై ఎస్పీ సీరియస్.. పేర్నినానిపై కేసు నమోదు

ABN , Publish Date - Oct 11 , 2025 | 09:58 AM

గతంలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిరసనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేని నిరసనకు వెళ్తున్నారంటూ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

Perni Nani Case: మచిలీపట్నం పీఎస్‌ ఘటనపై ఎస్పీ సీరియస్.. పేర్నినానిపై కేసు నమోదు
Perni Nani Case

కృష్ణా జిల్లా, అక్టోబర్ 11: మాజీ మంత్రి పేర్నినానిపై (Former Minister Perni Nani) కేసు నమోదు అయ్యింది. ఆర్ పేట సీఐ యేసుబాబుపై నిన్న (శుక్రవారం) పేర్ని నాని, వైసీపీ నేతలు దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకున్న ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాదా గిరి దిగారు పేర్నినాని. గతంలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిరసనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేని నిరసనకు వెళ్తున్నారంటూ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.


కేసు విచారణ కోసం నిన్న వైసీపీ బందరు పట్టణ అధ్యక్షులు మేకల సుబ్బన్నను స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. విషయం తెలిసిన వెంటనే పేర్నినాని, పలువురు వైసీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా సృష్టించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మేకల సుబ్బన్నది అక్రమ అరెస్ట్ అంటూ పీఎస్‌లో రెచ్చిపోయారు. పోలీసుల తప్పుడు కేసులను కోర్టులో ఎదుర్కుంటామని అన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సీఐ పట్ల పేర్నినాని దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. సీఐ విషయంలో పేర్నినాని వ్యవహరించిన తీరుపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి.


ఇవి కూడా చదవండి...

నిండు ప్రాణం తీసిన వేడి టీ.. టీ తాగిన రెండు రోజులకు..

వైసీపీ నేతల అండతో తిరుపతిలో విద్య అక్రమాలు, 18 కోట్ల మేర మోసాలు!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 10:24 AM