Home » Chennai
మదురై నుంచి శనివారం తెల్లవారుజామున చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానం ముందు వైపు అద్దం పగలడంతో కలకలం చోటుచేసుకుంది.
విజయ్ నివాసంలో గురువారం ఉదయం బాంబు పేలబోతోందని పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ నేపథ్యంలో, బాంబు స్క్వాడ్ నిపుణులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఆ దగ్గు మందులో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరితమైన ఇండస్ట్రియల్ కెమికల్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. డైథిలిన్ గ్లైకాల్ మనుషులు వాడకూడదు. డైథిలిన్ గ్లైకాల్ ఉన్న మందుల్ని తీసుకోవటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న తాజా చిత్రం 'మందాడి'. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు.
మధ్యాహ్నం 3.33 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు.
చెన్నైలో ప్రముఖ నటుడు విజయ్ ఇంట్లో భద్రతా లోపం చోటుచేసుకుంది. ఓ అగంతకుడు ఆయన నివాసంలోకి ప్రవేశించాడు. టెర్రస్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బ్రహ్మకమలం అనే పువ్వు 12యేళ్లకు ఒకసారి మాత్రమే వికిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందిన నీలంరంగు కురిం జి పుష్పం పుష్కర కాలం తరువాత ప్రస్తుతం నీలగిరి, కొడైకెనాల్ పశ్చిమ కనుమల్లో విరబూసింది.
నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న విద్యుత్ సబర్బన్ రైళ్లలో ప్రయాణం చేస్తున్నవారు ఎదురుగా వున్న సీట్లపై కాళ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని దక్షిణ రైల్వే హెచ్చరించింది. నగరం నుంచి ప్రతిరోజు తిరువళ్లూరు, ఆవడి, అరక్కోణం, తిరుత్తణి, గుమ్మిడిపూండి, సూళ్లూరుపేటలకు నడుపుతున్న విద్యుత్ సబర్బన్ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.
నగరంలో సూపర్ సిక్స్-సూపర్‌హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
గ్రిల్ చికెన్‌లో ‘లెగ్ పీస్’ లేకుండా వడ్డించిన ఓ హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫోరం రూ.10 వేల జరిమానా విధించింది. కేసు ఖర్చులకు మరో రూ.5వేలు కలిపి మొత్తం రూ.15వేలను వినియోగదారునికి చెల్లించాలని ఆదేశించింది.