Share News

Vijay Bomb Threat: విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Oct 09 , 2025 | 09:28 AM

విజయ్ నివాసంలో గురువారం ఉదయం బాంబు పేలబోతోందని పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ నేపథ్యంలో, బాంబు స్క్వాడ్ నిపుణులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

Vijay Bomb Threat: విజయ్ నివాసానికి  బాంబు బెదిరింపులు
Vijay bomb threat

చెన్నై, అక్టోబర్ 9: ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలో ఉన్న తమిళనాడు వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసాన్ని బాంబులతో పేల్చి వేయనున్నామని, విజయ్ నివాసంలో గురువారం ఉదయం బాంబులు పేలబోతున్నాయని పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.


ఈ నేపథ్యంలో, బాంబు స్క్వాడ్ నిపుణులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాంబు బెదిరింపు బూటకమని సోదాల్లో తేలింది. బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2025 | 09:35 AM