Share News

Mandaadi movie boat accident: మందాడి సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. పడవ బోల్తా..

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:55 PM

తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం 'మందాడి'. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు.

Mandaadi movie boat accident: మందాడి సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. పడవ బోల్తా..
Mandaadi movie boat accident

తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం 'మందాడి'. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నై సముద్రతీరంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది (boat accident).


షూటింగ్ సమయంలో సాంకేతిక నిపుణులు ఉన్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో ఆ పడవలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరినీ మిగిలిన వారు కాపాడారు. అయితే కెమెరాలు, ఇతర షూటింగ్ సామగ్రి మాత్రం సముద్రంలో కొట్టుకుపోయాయి. దాదాపు కోటి రూపాయల వరకు నష్టం సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి (film shoot capsizes).


సుహాస్‌కు ఇది తొలి తమిళ సినిమా (Suhas movie shoot accident). మతిమారన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.


ఇవి కూడా చదవండి..

ఈ వాచ్‌మెన్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటే.. స్ఫూర్తివంతమైన స్టోరీ..


మీ సమర్థతకు పరీక్ష.. 78ల మధ్యనున్న 87ను 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2025 | 01:12 PM