Share News

IndiGo fligh Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదరింపు.. చెన్నైకు మళ్లింపు

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:26 PM

మధ్యాహ్నం 3.33 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు.

IndiGo fligh Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదరింపు.. చెన్నైకు మళ్లింపు
IndiGo flight

న్యూఢిల్లీ: ఇండిగో (IndiGo) ముంబై-ఫుకేత్ (Mumbai-Phuket) 6E 1089 విమానాన్ని శుక్రవారంనాడు చెన్నైకి దారిమళ్లించారు. విమానంలోని లావెట్రీలో బాంబు బెదిరింపు మెసేజ్ కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3.33 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు. రాత్రి 7.16 గంటలకు సురక్షితంగా చెన్నై విమానాశ్రయానికి ఇండిగో విమానం చేరింది.


భద్రతా ముప్పును గుర్తించడంతో విమానాన్ని చెన్నైకి మళ్లించామని, ప్రోటాకాల్ ప్రకారం సమాచారాన్ని సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి చెన్నైలో భద్రతా తనిఖీలు జరిపినట్టు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ఫుకెట్ విమానాశ్రయంలో నైట్ కర్ఫ్యూ ఉన్నందున విమాన జర్నీని అర్ధరాత్రికి రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. ప్రయాణికుల ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రిఫ్రెష్‌మెంట్లు కల్పిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఇండిగో ప్రతినిధి చెప్పారు.


ఇవి కూడా చదవండి..

పారామిలటరీ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 09:28 PM