• Home » Chandrababu naidu

Chandrababu naidu

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...

KA Paul: ఏపీని అమెరికా చేసే సత్తా నాకు మాత్రమే ఉంది.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

KA Paul: ఏపీని అమెరికా చేసే సత్తా నాకు మాత్రమే ఉంది.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దూకుడు పెంచారు. తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే.. తనదైన హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని అమెరికా చేసే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు.

AP News: చంద్రబాబుతో టీడీపీ కీలక నేతల భేటీ.. కారణమిదే..?

AP News: చంద్రబాబుతో టీడీపీ కీలక నేతల భేటీ.. కారణమిదే..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆలూరు నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు కలిశారు. మంగళవారం నాడు చంద్రబాబుతో ఈ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

Chandrababu Naidu: మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్‌

Chandrababu Naidu: మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్‌

టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం (Praja Galam) సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) నిప్పులు చెరిగారు. మూడు ముక్కలాటతో అమరావతిని, రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని, సహజ వనరులను దోచేసిందని ఆరోపించారు.

Pawan Kalyan: చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత.. పవన్ కళ్యాణ్ ధ్వజం

Pawan Kalyan: చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత.. పవన్ కళ్యాణ్ ధ్వజం

చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో (Praja Galam Event) ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan) జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక సారా వ్యాపారి అని.. ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే, 84 వేల కోట్లు మాత్రమేనని అండర్ కోట్ చేశారని అన్నారు. పన్ను ఎగవేసి.. సొమ్ము దాచుకున్నారని ఆరోపించారు.

AP Elections: ఏపీలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిదే విజయం.. తేల్చేసిన సర్వేలు

AP Elections: ఏపీలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిదే విజయం.. తేల్చేసిన సర్వేలు

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. కొన్ని వార్తా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలు.. ఈసారి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి (TDP BJP Janasena Alliance) ఘనవిజయం సాధిస్తుందని ఆ సర్వేలు తెలిపాయి. ఈ కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వెల్లడించాయి.

Kodali Nani: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై (TDP Janasena BJP Alliance) మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా.. తనపై ఉన్న కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.

TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?

TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?

TDP-JSP Second List: టీడీపీ-జనసేన (TDP-Janasena) తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ప్రత్యక్షంగా చూస్తు్న్నాం. ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారిపోవడంతో పాటు.. ఈ జాబితా దెబ్బకు వైసీపీ అధిష్టానంలో వణుకు మొదలైంది. టీడీపీ, జనసేన తరఫున టికెట్లు ఆశించిన ఆశావహులు.. కొందరు సిట్టింగ్ తెలుగు తమ్ముళ్లు కాసింత నిరాశకు లోనయ్యారు. దీంతో వారందరికీ రెండో జాబితాలో (TDP-JSP Second List) న్యాయం చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి...

AP Elections: ఎన్డీఏలో చేరిన టీడీపీ, జనసేన.. జేపీ నడ్డా అధికారిక ప్రకటన

AP Elections: ఎన్డీఏలో చేరిన టీడీపీ, జనసేన.. జేపీ నడ్డా అధికారిక ప్రకటన

TDP Joins In NDA: తెలుగుదేశం పార్టీతో (Telugu Desam) పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

AP Politics: టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. కీలక ప్రకటన చేయనున్న మోదీ

AP Politics: టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. కీలక ప్రకటన చేయనున్న మోదీ

TDP-Janasena-BJP : ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) నోటిఫికేషన్‌కు ముందే పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) పొత్తుతో ఒక్కసారిగా అధికార వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ఢిల్లీ టూర్‌తో బీజేపీతో పొత్తు కుదిరింది. ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు, పవన్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి