Google AI Hub in Visakha: విశాఖలో గూగుల్ AI హబ్.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మైలురాయి
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:17 PM
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ AI హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ AI హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.
గూగుల్ 10 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250 కోట్లు)తో విశాఖలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డిఐ ప్రాజెక్ట్ కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లాభం, 1.88 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి అదనంగా సుమారు రూ.9,553 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. విశాఖపట్నం AI సిటీగా రూపాంతరం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు AI నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విదేశీ పెట్టుబడిని సాధించాయన్నారు. ప్రపంచ దృష్టి ఆంధ్రప్రదేశ్ పై ఉండేలా ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ AI, టెక్ హబ్‌గా నిలబెడుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Also Read:
తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..
ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం
For More Latest News