Vijayawada Diarrhea Outbreak: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించండి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:34 PM
విజయవాడలో డయేరియా కేసులు ఒక్కసారిగా పెరగడం సంచలనం రేపింది. రాజరాజేశ్వరిపేటలో వాంతులు, విరోచనాలతో ప్రజలు బాధపడుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. సీఎం చంద్రబాబు సూచన మేరకు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
విజయవాడలో డయేరియా కేసులు ఒక్కసారిగా పెరగడం సంచలనం రేపింది. రాజరాజేశ్వరిపేట (New Rajarajeswari Pet)లో వాంతులు, విరోచనాలతో ప్రజలు బాధపడుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. ఈ మేరకు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా, ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. ఆర్ఆర్ పేటలో ఇంటింటి సర్వే చేసినట్టు తెలిపారు (Vijayawada health news).
సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నామని, ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని, వదంతులు నమ్మవద్దని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బొండా ఉమా హామీనిచ్చారు. ఇక, మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని తెలిపారు. డయేరియా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే మున్సిపల్, వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారని తెలిపారు (Diarrhea outbreak).
ఇప్పటికే చాలా మందికి వాంతులు, విరేచనాలు తగ్గాయని, హాస్పిటల్ నుంచి కొంతమంది డిశ్ఛార్జ్ అయ్యారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించారని, ఎలాంటి సమస్యా లేదని తేలిందని తెలిపారు (Contaminated water Vijayawada). తాగునీటి పైప్ లైన్‌లో డ్రైన్ వాటర్ ఎక్కడైనా కలుస్తోందేమో అనేది కూడా పరీక్షిస్తున్నామన్నారు. ప్రస్తుతం బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest Andhra Pradesh News and National News