AP CM Chandrababu Naidu: ఉద్యోగులకు డీఏ ఇస్తాం.. వారి సమస్యలను పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:29 PM
ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములని, ఉద్యోగుల బాగోగులు చూడడం తమ భాద్యత అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలని ఉందని, అయితే అందుకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.
ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములని, ఉద్యోగుల బాగోగులు చూడడం తమ భాద్యత అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలని ఉందని, అయితే అందుకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలల సమయం పట్టిందని, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు కూడా బాధితులేనని అన్నారు (Andhra Pradesh govt employees).
ఉద్యోగులకు 34 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, 4 డీఏలు పెండింగ్ ఉన్నాయని సీఎం అన్నారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, వచ్చేనెల (నవంబర్ 1) నుంచి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎర్న్‌డ్ లీవ్ లు 50-50 కింద క్లియర్ చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్‌లు ఇచ్చామని, ఎక్కడా ఆలస్యం చేయలేదని గుర్తు చేశారు. ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించిన వ్యవస్థను 60 రోజుల్లోపు స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. పోలీసులకు రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో సరెండర్ లీవులు చెల్లిస్తామని, దీనికోసం రూ.105 కోట్లు, రూ.105 కోట్లు చొప్పున రూ.210 కోట్లు జనవరిలోగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు (Chandrababu Naidu DA).
ఎక్సైజ్‌కు సంబంధించి భవిష్యత్తు ఆదాయంపైనా గత ప్రభుత్వ పెద్దలు అప్పు తెచ్చారని విమర్శించారు. విభజన వల్ల చాలా స్ట్రక్చరల్ చేంజస్ వచ్చాయని, ఉద్యోగులు ఎక్కవ మంది వచ్చారని, ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు (AP government employees benefits). ప్రతీ ఉద్యోగీ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని, రేపట్నుంచి ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే సంపద సృష్టి లో రెండో స్థానానికి వచ్చినందుకు ఆనందంగా ఉందని, వచ్చే సంవత్సరం మొదటి స్థానానికి వచ్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News