AP CM Chandrababu Naidu: పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:31 PM
బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి త్యాగానికి ప్రతీకగా (Statue Of Sacrifice) గా నామకరణం చేశారు.
బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి త్యాగానికి ప్రతీకగా (Statue Of Sacrifice) గా నామకరణం చేశారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో కేటాయించిన 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి జరగబోతోంది. ఆ రోజు నాటికి ఈ స్మృతివనంలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు (CM Chandrababu Naidu).
పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News