Home » Central Govt
రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎల్‌ఐసీకి రూ.1,359.56 కోట్ల వార్షిక ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపారు.
టెలిగ్రామ్ ఓ 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.
వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల పథకం లబ్ధిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా ఈ నెలాఖరులోగా తమ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్‌లో ఏ మంత్రిపై ఏవిధమైన ఆరోపణలు లేవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా చాలా మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వ తేదీన గాంధీభవన్‌లో భారీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 100 కంపెనీలు గాంధీ భవన్‌కు వస్తున్నాయని వివరించారు.
పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీసు ధ్రువీకరణ సేవలకు గాను ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ వరించింది.
కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని తలపెట్టిన వీబీజీ రాంజీ స్కీం పట్ల నిరసన తెలపాలని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తమ నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కి సంబంధించిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి భారత్‌లో మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.