Home » Central Govt
కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చారని ఆరోపించారు.
'సుపరిపాలనకు ఏడాది' పేరుతో సమగ్ర అభివృద్ధి నివేదికని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రకటించారు. 2019-24 వరకు నియంతృత్వ పాలకుల పాలనలో ఏపీ నలిగిపోయిందని చెప్పారు. జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి దూరమై శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు
బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గోదావరిలో నీళ్లను ఇరు తెలుగు రాష్ట్రాలు వాడుతున్నాయని వివరించారు. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. ఇక్కడికి వచ్చిన నీటిని మరో బేసిన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కృష్ణాలో తక్కువగా ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. గంటసేపు ఈ భేటీ కొనసాగింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. చట్టప్రకారం అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్ బుక్‌లో ఉన్నాయని నారా లోకేష్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు ఢిల్లీలో బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు లోకేష్ షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రణాళిక శాఖపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ విజయానంద్, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
Banakacherla Project: పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్‌కు అనేకసార్లు వినతి చేశారు కూడా. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి అడుగుపడింది.