Home » Central Govt
నాందెడ్, బీదర్ స్టేషన్ల నుంచి చాపర్లను పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో పలువురు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఫోన్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.
మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని.. వారిలో ఏపీకి చెందిన నలుగురు తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ముగ్గురు, రాజమండ్రికి చెందిన ఒకరు ఉన్నారని చెప్పుకొచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచి వాళ్లు కావాలని ఆకాంక్షించారు.
సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగుల సహా పలువురు వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవరిస్తున్న స్టాండప్ కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలను కట్టడి చేసేలా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ప్రధాని మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీపీఐ పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమిత్ షా చంపుతున్నారని ధ్వజమెత్తారు.
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత పలు ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మూతపడ్డాయి. Dream11, My11Circle, WinZO, Zupee, Nazara Technologies- మద్దతుగల PokerBaazi వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్ ఆఫర్‌లను నిలిపివేసాయి.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.