Home » CBI
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులలో రూ.232 కోట్లకు పైగా తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలతో సంస్థ సీనియర్ మేనేజర్‌ను CBI అరెస్టు చేసింది. వాస్తవ అంకెలకు సున్నాలు జోడించి..తన షేర్ మార్కెట్ 'ట్రేడింగ్ ఖాతాలకు' బదిలీ చేశారని..
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కేసీఆర్, హరీష్‌రావు పేర్కొన్నారు.
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది.
తెలంగాణ హై కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలైంది.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి బీ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదని సీబీఐ పేర్కొంది.
వివేకా హత్యకేసుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.
మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం కేవలం కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచన. దాన్ని ఇష్టానుసారం అమలుచేయడం, తానే ఇంజనీర్‌లా వ్యవహరించడం, ప్లానింగ్‌లో, నిర్మాణంలో లోపాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలమయ్యాయి.
మొబైల్ షాపు యజమాని నుంచి భారీగా ముడుపులు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ సీబీఐ అధికారులకు చిక్కాడు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..