Sugali Preethi Case: సీబీఐకి సుగాలి ప్రీతి కేసు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:54 AM
సుగాలి ప్రతీ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి అప్పగిస్తూ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు.
అమరావతి: సుగాలి ప్రతీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి అప్పగిస్తూ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసుపై ఆయన దృష్టి పెట్టారు. సీఐడీ అధికారులతో మాట్లాడి కేసు దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నపుడు పవన్ కల్యాణ్ ఈ కేసుపై పోరాటం చేశారు. కర్నూల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. సభ పెట్టి మరీ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రీతిబాయి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.37ను విడుదల చేసింది. అయితే, తర్వాతి కాలంలో కేసు ఎలాంటి పురోగతి సాధించలేదు.
అసలేం జరిగింది..!?
2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో ప్రీతిబాయి ఉరి వేసుకుని మృతి చెందింది. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు మరుగున పడిపోయింది. పవన్ కారణంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి అందాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి.
ఇవి కూడా చదవండి
గంటకు 5,500 మందికి శ్రీవారి దర్శనం
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..