Home » CBI
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు(బుధవారం) విచారణ జరిగింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సీబీఐ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థపై సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది.
కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సవాలు చేసింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. తక్షణం పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టును కోరింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..