Sunil Yadav On Viveka Murder Case: ప్రముఖులను విచారించండి.. A2 సునీల్ యాదవ్
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:46 PM
వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సునీత పిటిషన్‌కు ఏ2 సునీల్ యాదవ్ మద్దతు తెలిపారు.
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (Viveka Murder Case) కేసు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న సునీత పిటిషన్‌పై CBI ప్రత్యేక కోర్టులో విచారణ జరగగా, ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ తన కౌంటర్‌ను దాఖలు చేశాడు. కౌంటర్‌లో సునీల్ యాదవ్ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. CBI దర్యాప్తు కొనసాగించాలన్న సునీత పిటిషన్‌కు మద్దతు తెలిపారు. వివేకా కేసులో సంచలన అంశాలు వెలుగులోకి రావాలని, అనేకమంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందని సునీల్ పేర్కొన్నాడు.
కాగా, తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలంటూ సునీతారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. నిందితులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, సునీత దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, తన వినతిని తిరస్కరించాలని నిందితులుగా ఉన్న ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఏ7 వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఏ8 కడప ఎంపీ అవినాష్ రెడ్డి న్యాయస్థానంలో ఇటీవల కౌంటర్ దాఖలు చేశారు. అయితే.. తాజాగా, సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై తనకు అభ్యంతరం లేదని సునీల్ ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read:
జగన్ కాన్వాయ్ ఢీ.. పలువురికి గాయాలు..
కల్పిత వీడియోలపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
For More Latest News