Home » BRS
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే, తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మరి ప్రజాభిప్రాయంపై సర్వే సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. . కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందోనని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్‌రావు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 11న ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది వార్తలో చదవండి.