Home » BRS Chief KCR
దేశంలో తెలంగాణను ముందుంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక్కడున్న వ్యాపారస్తులను, పత్రికల యాజమాన్యాలను బీఆర్ఎస్ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పాకే బనకచర్లపై ఏపీ ముందుకు వెళుతోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్ట్‌లు ఆగిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణ ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లు కొట్టుకుపోవడానికి కారణం కేసీఆర్ కాదా అని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్కే భవన్‌లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు.
కాళేశ్వరం కమిషన్ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము గతంలో కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. నోటీసులు ఇవ్వడాన్ని సహించమని రేవంత్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదల మేలు కోసం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.