Home » BJP
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల భవనాలపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరగవచ్చన్న పక్కా సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు.
టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరిన క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో గెలిచి బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.
డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడి అంశంపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు దూసుకెళ్లేందుకు యత్నించారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన TVK అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతోంది. రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు.
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కోట్ల రూపాయలు ఎక్కడివని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.