Home » BJP
ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం.
బీఎల్ఓ ఆత్మహత్య నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం చేస్తున్న ప్రకటనలకు విశ్వసనీయత లేదని బీజేపీ మండిపడింది. స్వతంత్ర దర్యాప్తు తరువాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తేల్చి చెప్పింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. అందులో బీజేపీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
నితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది.
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ హితవు పలికారు.
సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది.
ఆర్కే సింగ్ ఎన్నికల సమయంలో పలువురు ఎన్డీయే నేతల అవినీతి, ఫ్యాక్షనిజంపైన ఆరోపణలు చేయడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణపై ఎన్నికల కమిషన్ను బహిరంగంగానే తప్పుపట్టారు. మొకామాలో జరిగిన హింసాకాండపై ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్పై విమర్శలు గుప్పించారు.
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం బెంగాల్పై ఉండదని టీఎమ్సీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ నేతల సంబరాలు నిర్హేతుకమని కామెంట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు వేర్వేరని వివరించారు.