Share News

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. చట్టపరమైన చర్యలకు ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ ..

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:49 PM

మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య సంఘటనను.. ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో ప్రస్తావించారు . బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. చట్టపరమైన చర్యలకు ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ ..
MP Lakshman

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంఘటనను ఎంపీ లక్ష్మణ్ (MP Lakshman) రాజ్యసభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఇలాంటి దారుణం జరగడం దారుణమన్నారు. ‘గెలవడం ఖాయం.. గెలిచిన తర్వాత కూడా నన్ను అధికార పార్టీ వేధిస్తుందని భార్యతో స్పష్టంగా చెప్పి.. ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఎంపీ తెలిపారు.


ఈ దారుణ సంఘటనను సభా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు ఎంపీ చెప్పారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ.. ఈ విషయంపై సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా దురాగతాలకు పాల్పడటం తీవ్ర అభ్యంతరకరమని ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


దర్యాప్తు చేస్తున్నాం: డీజీపీ శివధర్ రెడ్డి

shivadhar-reddy.jpg

మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) స్పందించారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహదేవప్ప సూసైడ్ లెటర్ రాయలేదని, పూర్తి విచారణ జరిపి.. వాస్తవాలు బయటపెడతామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

హీరోయిజం చూపిస్తే.. కఠిన చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 02:41 PM