Home » Bihar
హెచ్ఏఎం అభ్యర్థుల్లో దీపా కుమారి (ఇమామ్ గంజ్), అనిల్ కుమార్ (తెకరి), జ్యోతి దేవి(బరచాటి), రోమిత్ కుమార్ (అత్రి), ప్రఫుల్ కుమార్ సింగ్ (సికింద్రా), లలన్ రామ్ (కుటుంబ) ఉన్నారు.
'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు. లఖిసరాయ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు విజయ్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2005, 2010, 2015, 2020లో ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు.
హెచ్ఏఎం (సెక్యులర్)తో పాటు సీట్ల షేరింగ్‌లో భాగంగా రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు కూడా ఆరు సీట్లు దక్కాయి. రాష్ట్రంలో బిగ్ బ్రదర్ ఎవరనే ప్రసక్తి లేకుండా జేడీయూ, బీజేపీ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
బిహార్‌లో ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ హోటల్స్ నిర్వహణ టెండర్స్ కేసులో కోర్టు లాలూ, ఆయన కుటుంబంపై అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాలను మోపింది.
బిహార్‌లోని అన్ని భాగస్వామ్య పార్టీలతో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాలపై ఖర్గే తుది చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బిహార్ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపులను స్వాగతించినట్టు కూటమి నేతలు వెల్లడించారు. తమ కూటమి బిహార్‌లో తిరిగి అధికారం చేపట్టగలదనే ధీమాను వ్యక్తం చేశారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు గట్టి పట్టున్న రఘోపూర్ నుంచి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ఎలాగైతే అమేథీలో ఓడిపోయారో అలాగే తేజస్విని సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని కిశోర్ తెలిపారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, బిహార్‌లో ఎన్డీయే కూటమికి జేడీయూ నాయకత్వం వహిస్తుంది. 101 నుంచి 102 సీట్లలో ఆ పార్టీ పోటీ చేయనుంది. జేడీయూ కంటే ఒక సీటు తక్కువతో బీజేపీ పోటీ చేయనుంది.
రఘోపూర్ నుంచి గెలిచే లాలూ, రబ్రీ ముఖ్యమంత్రి పదవులు చేపట్టారనీ, తేజస్వి కూడా రఘోపూర్ నుంచి రెండు సార్లు గెలిచారని, బిహార్ ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.