Home » AP Govt
ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ వైద్యా, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా 12 జిల్లాల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉందని చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్.
విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని పాలకమండలి సభ్యులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులపై సంబంధిత అధికారులకి కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్యూయిజ్లు, సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.
మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
గ్రామస్థాయి నుంచి అత్యవసర సేవలు అందించటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. 175 హోర్డింగ్ పాయింట్లు గుర్తించి వాటిని తొలగించడం జరిగిందని చెప్పారు.
మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
మెుంథా తుపాన్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.