Home » AP BJP
ఐదేళ్ల జగన్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తుంటే.. జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారని యామిని శర్మ మండిపడ్డారు.
ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
ఏపీ బిజెపి కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయింది. అయితే కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత వచ్చినట్లు కనించడంలేదు. తాజాగా గుంటూరు బీజేపీలో అసంతృప్తి సెగలు అలుముకున్నట్లు తెలుస్తోంది.