Home » Anantapur urban
బ్యాంకుల్లో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీ చేపట్టాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 24, 25వ తేదీలలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక సాయినగర్‌లోని స్టేట్ బ్యాం కు ఆఫ్ ఇండియా ఎదుట సన్నాహక నిరసన నిర్వహించారు.
మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. శుక్రవారం జడ్పీ ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నగర సమీపంలోని ఉప్పరపల్లి క్రాస్‌లో పండమేరు బ్రిడ్జి మూతపడి, రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఇది జరిగి నాలుగు గడిచినా, బ్రిడ్జిపై వాహన సంచారానికి మోక్షం కలగడం లేదు. ఫలితంగా కొత్త ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఒనవే కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతు న్నారు.
డిప్లొమా ఇన మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (పారా మెడికల్) పరీక్షల పలితాల్లో అనంతకు చెందిన కావ్య రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. అనంత మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కావ్య 480కిగాను 416మార్కులతో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది.
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జన్మతిథిని పురస్కరించు కుని గురువారం మొదటి రోడ్డు లోని రాఘవేంద్రస్వామి మఠం లో వేడుకలను భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనా న్ని వివిధ రకాల పుష్పాలతో న యనమనోహరంగా అలంకరిం చారు.
మ్యానహోల్ స్కావెంజర్ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీ గా అమలు చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికా రులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సం బంధిత అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమాజంలో మార్పుకోసం విజిలెన్స కమిటీ సభ్యులు కృషిచేయా లని సూచించారు. ఇప్పటికీ మ్యానహోల్‌లోకి మనషు లను దించుతున్నారని, అలాచేసిన అధికారులపై వి చారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇంతకు ము నుపు నోటీసులు ఇచ్చారన్నారు.
నియోజకవర్గంలోని చెరువులు నింపితే సాగు, తాగు నీ రు సమస్య తలెత్తకుండా ఉంటుం దని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బుధవారం మంత్రి లోకేశను ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గం సమస్యలపై వినతి పత్రం అందజే సినట్లు తెలిపారు.
జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేఎనటీయూ రోడ్డులోని విద్యుత్తు శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం పీఎం సూర్యఘర్ ముఫ్త్‌బజిలీ యోజన, పీఎం కుసుమ్ తదితర వాటిపై విద్యుత్తు అధికారులతో ఆయన సమీక్షించారు.
నాకు అన్ని అర్హతలున్నాయి... అందుకు అనుగుణంగా పోస్టు కేటాయించాల్సిం దేనని డిజిటల్ అసి స్టెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ నాయక్ ఎస్సీ, ఎస్టీ కమిషనను ఆశ్ర యించారు. ఉద్యోగ నియామకాలు పూర్తయి ఐదేళ్లు గడుస్తున్నా.. పట్టువీడని బట్టీ విక్రమార్కుడిలా ఆయన తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కదిరి ప్రాంతానికి చెందిన శ్రీనివాసనాయక్ కుమారుడు వినోద్‌కుమార్ బీకాం(జనరల్) పూర్తి చేసినట్లు అధికారులు చెబుతు న్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా అర్హులైన ప్రతిఒక్కరికి ఉచితంగా వైద్యం అందించా ల్సిందేనని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఆయన మంగళ వారం కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవపై సమీక్ష నిర్వహించారు.