STRUCTURES: శ్మశాన వాటికలో నిలిచిపోయిన నిర్మాణాలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:26 AM
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత శ్మశాన వాటిక ప్రహరీ, భవనం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శింగనమల ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు వైసీపీ ప్రభుత్వంలో చుట్టూ ప్రహరీ, భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ. 12 లక్షలు, ఏఆర్‌జీసీ నిధులు రూ. 7 లక్షలు చొప్పున మొత్తం రూ. 19 లక్షలు కేటాయించారు. వీటితో అక్కడ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు.

శింగనమల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత శ్మశాన వాటిక ప్రహరీ, భవనం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శింగనమల ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు వైసీపీ ప్రభుత్వంలో చుట్టూ ప్రహరీ, భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ. 12 లక్షలు, ఏఆర్‌జీసీ నిధులు రూ. 7 లక్షలు చొప్పున మొత్తం రూ. 19 లక్షలు కేటాయించారు. వీటితో అక్కడ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. అందులో ఇప్పటి వరకు రూ. 17 లక్షల బిల్లులు మంజూరైనట్లు రికార్ఢులు చెబుతున్నాయి. అయితే అక్కడ భవన నిర్మాణం కేవలం టాప్ దశలోనే నిలిసిపోయింది. ప్రహరీని సగం వరకు కట్టి వదిలేశారు. ఎస్సీ కాలనీ వాసులు ఎవరైనా మృతి చెందితే శ్మశాన వాటికలో పూడ్చడానికి వీలు లేకుండా కంపచెట్లు పెరిగాయి. మంజూరు చేసిన రూ. 19 లక్షల్లో రూ. 17 లక్షలు ఖర్చు చేసినా ప్రహరీ, భవనం ఆ మేరకు కూడా పూర్తికాకపోవడం ఏమిటని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్పందించి తమ కాలనీకి చెందిన శ్మశాన వాటిక పనులు పూర్తి చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....