Share News

CITU : బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:33 AM

శ్రీరామిరెడ్డి వాటర్‌ వర్క్స్‌ స్కీమ్‌ కార్మికుల పది నెలల వేతన బకాయిలు, 35 నెలల పీఎఫ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంగళవా రం కలెక్టరేట్‌ ఎదుట కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం డిఆర్‌ఓ మలోలను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... పగలు, రాత్రి తేడాలేకుండా పనిచేస్తున్న కార్మికులు వేతనాల కోసం సంవత్సరంలో మూడు దఫాలు సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

 CITU : బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి
Obulu and others submitting a petition to DRO Malola

- లీటర్‌ బేస్‌ విధానాన్ని రద్దు చేయాలి

- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు

- నీటి సరఫరా కార్మికుల నిరసన

అనంతపురం కల్చరల్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): శ్రీరామిరెడ్డి వాటర్‌ వర్క్స్‌ స్కీమ్‌ కార్మికుల పది నెలల వేతన బకాయిలు, 35 నెలల పీఎఫ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంగళవా రం కలెక్టరేట్‌ ఎదుట కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం డిఆర్‌ఓ మలోలను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... పగలు, రాత్రి తేడాలేకుండా పనిచేస్తున్న కార్మికులు వేతనాల కోసం సంవత్సరంలో మూడు దఫాలు సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే బడ్జెట్‌లో కేటా యింపులు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ మధ్యకాలంలో లీటర్‌ బేస్‌ విధానం వల్ల కరెంటు లేనప్పుడు, నాసి రకం పైపు లు పగిలి పోయిన ప్పుడు ఆ ప్రాం తాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందన్నారు. మరోవైపు అత్తమీద కోపం దుత్తమీద తీర్చినట్లు కార్మికుల వేతనాల్లో రూ.2500 తగ్గించారని, వచ్చే నెలకూడా మరో రూ.2వేలు తగ్గించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని, ఇది సరి కాదన్నారు. ఇప్పటికైనా కార్మికుల బకాయి వేతనాలు, పీఎఫ్‌ చెల్లించి, లీటర్‌ బేస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి వాటర్‌ సప్లయ్‌ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి రాము, కోశాధికారి హొన్నూరుస్వామి, ప్రభాకర్‌, సోము, చిక్కన్న, హనుమంత రాయుడు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 12 , 2025 | 12:33 AM