PARITALA SRIRAM వినికిడిలోపం శాపంగా మారకూడదు
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:09 AM
విద్యార్థులకు వినికిడిలోపం శాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు.
రామగిరి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు వినికిడిలోపం శాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. గురువారం స్థానిక పరిటాల రవీంద్ర ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక క్యాంప్‌నకు ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వినికిడిశక్తిలేని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వినికిడి యంత్రాలను అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు వినికిడిలోపం శాపంగా మారకుండా దీనదయాల్ శ్రవణ ఫౌండేషన చేస్తున్న కృషి గొప్పదన్నారు. ఈ క్యాంప్ రెండు రోజులు ఉంటుందని వినికిడి లోపం ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఫౌండేషన చైర్మన రేగుల రామాంజనేయులు,సోలార్ ఎనర్జీ లిమిటెడ్ డీజీఎం వెంకటేశ, అమర్‌రాజ మేనేజర్ అరవిందు, సాక్ష్యం జిల్లా కన్వీనర్ పవన, మెడికల్ ఆఫీసర్ సోలమన, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ క్రిష్ణకిశోర్, టీడీపీ నాయకుడు రామ్మూర్తినాయుడు, శ్రీనాథ్, మారుతీప్రసాద్, శ్రీదర్‌నాయుడు, శ్రీనివాసులు,ఎస్ ఆంజనేయులు, పూజారి అక్కులప్ప, పేపర్ శీన పాల్గొన్నారు.